సిద్ధిపేటలో ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొని దూసుకెళ్లిన లారీ.. 10 మంది మృతి

  • రెండు లారీలు, బస్సు, క్వాలీస్‌ పరస్పరం ఢీ
  • 26 మందికి గాయాలు
  • ఆసుపత్రులకు తరలింపు
సిద్ధిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌ రాజీవ్‌ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలు, బస్సు, క్వాలీస్‌ పరస్పరం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 26 మంది గాయాలపాలు కాగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పోలీసులు దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. అదుపుతప్పిన ఓ బస్సు... దాని ముందు ఉన్న లారీని ఢీ కొట్టగా, ఆ లారీ డివైడర్‌ను ఢీ కొట్టి ముందుకు దూసుకెళ్లింది.

అదే సమయంలో ఆ రోడ్డుపై వెళుతోన్న క్వాలీస్‌తో పాటు ఓ కంటైనర్‌ను సదరు లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో క్వాలీస్‌ పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదానికి కారణమైన బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. దీనిపై సమాచారం అందుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. 
Go Back to Shorts
Siddipet District
Road Accident

More Telugu News